సెట్‌లో బంగారు ఉంగారలు పంచిన విజయ్‌

తమిళ హీరో, ఇళయపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘బిగిల్‌’. మురగదాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం విజయ్‌ అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చివరిదశ చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో విజయ్‌ ఇటీవల తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ ఈ సినిమా కోసం కష్టపడిన 400 మంది నటులు, టెక్నీషియన్స్‌కు బంగారు ఉంగరాలను అందించారు. అంతేకాకుండా తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఫుట్‌బాల్స్‌ను సైతం బహూకరించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో విజయ్‌ తండ్రి, కుమారుడి పాత్రల్లో కనిపించనున్నారు.
ఒక గ్యాంగ్‌స్టార్‌, మహిళ ఫుట్‌బాల్‌ కోచ్‌గా విజయ్‌ కనిపించనున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత సమకూర్చుతున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.