HomeTelugu Newsషకీల రాసిన కుటుంబ కథాచిత్రం

షకీల రాసిన కుటుంబ కథాచిత్రం

11 1
షకీల అంటే ఒకప్పుడు స్టార్ హీరోలను సైతం వణికించిన చరిత్ర ఈ పేరుకు ఉంది. స్టార్ హీరోలతో సమానం రెమ్యునరేషన్ తీసుకుని సౌత్ ఇండియాలో సంచలన నటిగా పేరొందిన షకీలా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల సంపూర్ణేష్‌ బాబు చిత్రంలో రీఎంట్రీ ఇచ్చి అలరించింది. ఇప్పడు ‘షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’ అనే సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో షకీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సీవీ రెడ్డి సమర్పణలో, సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్‌చాంబర్‌లో జరిగింది.

ఈ సందర్భంగా నటి షకీల మాట్లాడుతూ ”నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. షకీల అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసమే కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నానని తెలిపింది. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu