HomeTelugu Trending'శాకుంత‌లం' అప్డేట్‌

‘శాకుంత‌లం’ అప్డేట్‌

shakuntalam movie update
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తున్న తాజా చిత్రం ‘శాకుంత‌లం’. పాన్ ఇండియా స్థాయిలో పీరియాడిక‌ల్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాకి గుణ శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తయింద‌ని గుణ‌శేఖ‌ర్ టీం ప్ర‌క‌టించింది. అయితే కొన్ని వారాలుగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్స్ ఏం లేవు. దీంతో ఏదైనా అప్ డేట్ ఇవ్వాలంటూ అభిమానుల నుంచి విజ్ఞ‌ప్తులు వ‌స్తూనే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో నీలిమ గుణ సినిమా అప్‌డేట్‌ను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు, సీజీ వ‌ర్క్ ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్, అన‌న్య నాగ‌ళ్ల‌, అల్లు అర్హ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గుణ‌టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై మైథ‌లాజిక‌ల్ డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ చిత్రం తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో నిర్మిత‌మ‌వుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu