HomeTelugu Trendingరజనీకాంత్‌ సినిమాలో శర్వానంద్‌!

రజనీకాంత్‌ సినిమాలో శర్వానంద్‌!

Sharwanand in Rajinikanthsసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. త్వరలోనే జై భీమ్ దర్శకుడితో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తె అయిపోయ్యాయి. ఈ సినిమాలో అమితాబ్‌ సైతం ఈ సినిమాలో ఓ కీలకపాత్ర చేయనున్నారు. ఇక శర్వా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు వస్తున్న వార్తలు అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ వార్త వైరల్‌ అవుతుంది.

ఈ సినిమాలో శర్వా నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎంతటి హీరో అయినా.. తమ కెరీర్‌లో ఒక్కసారైనా విలన్‌ పాత్ర చేయాలని ఆశపడుతుంటారు. అలాంటి ఆఫరే తలుపు తడితే శర్వా మాత్రం కాదంటాడా. అది కూడా రజనీ సినిమాలో అనగానే అంతకంటే అదృష్టం ఏముంది అనుకుంటున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్తలు మాత్రం చెన్నై మీడియాల్లో తెగ వైరల్‌ అవుతుంది. అంతేకాకుండా ఈ ఆఫర్‌ ముందుగా నానికి వచ్చిందట. నానికి విలన్‌ రోల్స్‌ పెద్దగా కలిసిరాలేదు. దాంతో మరోసారి అలాంటి సాహసం చేయాలేనని మేకర్స్‌కు కరాకండిగా చెప్పినట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu