HomeTelugu Big Storiesషేర్నీ ట్రైలర్‌

షేర్నీ ట్రైలర్‌

Sherni Official Trailer
బాలీవుడ్ న‌టి విద్యా బాలన్ నటించిన తాజా చిత్రం ‘షేర్నీ’. అమిత్ మ‌సుర్క‌ర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 18 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో అట‌వీ శాఖ అధికారిగా క‌నిపించింది విద్యా బాల‌న్‌. అడ‌వి నేప‌థ్యంలో సాగిన స‌న్నివేశాలు, నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో శరద్‌ సక్సేనా, ముకుల్‌ చద్ధా, విజయ్‌ రాజ్‌, అరుణ్‌, బ్రిజేంద్ర కాలా, నీరజ్‌ కబి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు నిర్మించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu