ముచ్చటగా మూడోసారి!

ఇళయదలపతి విజయ్ సరసన ఇప్పటివరకు ఏ హీరోయిన్ మూడు సార్లు నటించలేదు. ఆ అవకాశం కాజల్ అగర్వాల్ కు దక్కినట్లు తెలుస్తోంది. గతంలో కాజల్, విజయ్ జంటగా నటించిన ‘తుపాకి, జిల్లా’ వంటి చిత్రాలు మంచి సక్సెస్ ను సాధించాయి. ఆ తరువాత తాజాగా మరోసారి ఇద్దరు కలిసి నటించడానికి సిద్ధమవుతునట్లు కోలీవుడ్ వర్గాల టాక్. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరావా సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత విజయ్, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘తేరి’ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. అదే నమ్మకంతో మరో సినిమాకు రెడీ అయిపోతున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి కాజల్ ను ఎంపిక చేశారు. కథ ప్రకారం మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీను ఎంపిక చేసే పనిలో పడ్డారు.