మోహన్‌బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ

సినీ హీరో శివాజీ ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్‌బాబు తిరుపతిలో నిరసనకు దిగారు. దీనిపై శివాజీ స్పందించారు. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్‌బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు.