SIIMA 2024 winners list:
సినీ ప్రేమికులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవార్డుల వేడుక రానే వచ్చింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకు గాను.. ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో చాలామంది అవార్డులు అందుకున్నారు.
అవార్డుల వేడుక లలో భాగంగా పలువురు నటీమణులు డాన్స్ లో తమ అద్భుతమైన పర్ఫామెన్స్ ప్రదర్శించారు. ఫరియా అబ్దుల్లా.. శ్రేయ.. నేహాశెట్టి.. శాన్వీ తదితరులు తమ ప్రదర్శనలతో సైమా అవార్డుల ఫంక్షన్ ను మరింత అందంగా మార్చేశారు. ఇక తెలుగు సినిమాలకు సంబంధించి ఎవరెవరికి అవార్డులు వచ్చాయి అంటే.. ఉత్తమ చిత్రంగా బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి, ఉత్తమ నటుడిగా దసరా లో అదరగొట్టిన హీరో నాని.. హీరోయిన్గా అదే సినిమాలో నటించిన కీర్తి సురేష్ అవార్డులు అందుకున్నారు.
ఈ ఏడాది సైమా 2024 అవార్డుల విజేతల జాబితా ఇలా ఉంది..
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి కీర్తి సురేశ్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా ఖాన్ (హాయ్ నాన్న)
ఉత్తమ కమెడియన్: విష్ణు (మ్యాడ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్ (హాయ్ నాన్న, ఖుషీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్)
ఉత్తమ సినీ గేయ రచయత: అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా, బేబీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు, బలగం)
ఉత్తమ నూతన నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ నూతన నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ నూతన దర్శకుడు: శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ నూతన నిర్మాత: వైరా ఎంటర్ టైన్ మెంట్స్ (హాయ్ నాన్న)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా
క్రిటిక్స్ ఛాయిస్ కేటగిరీ:
ఉత్తమ నటుడు: ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి: మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు: సాయి రాజేశ్ (హాయ్ నాన్న)
Read More: కౌన్ బనేగా కరోర్ పతి లో Pawan Kalyan గురించిన ప్రశ్న