‘సాహో’ బ్యూటీ పెళ్లికి రెడీ!

‘సాహో’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 15 వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్నది. ఇందులో శ్రద్ధా కపూర్ పవర్ఫుల్ కాప్ పాత్ర చేస్తున్నది.

ఇప్పుడు శ్రద్దా కపూర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమంటే.. శ్రద్దా కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రద్దా కపూర్ చిన్ననాటి స్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ ను వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై ఆమె తండ్రి శక్తి కపూర్ స్పందించాడు. ఇప్పట్లో శ్రద్దా కపూర్ పెళ్లి చేసుకోవడం లేదని, ఆమె దృష్టి మొత్తం తన కెరీర్ పైనే ఉందని చెప్పాడు. సాహో తో పాటు శ్రద్ధా బాలీవుడ్ లో డాన్స్ మూవీ చేస్తున్నది.