ఎన్టీఆర్‌ రిస్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా..!

జూనియర్‌ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత ‘రామ్ చరణ్’ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2020 లో సినిమా విడుదల కాబోతున్నది.

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక రాజమౌళి విరామం ఇచ్చాడు. ఈ విరామంలో తన కుమారుడు కార్తికేయ వివాహం చేస్తున్నాడు. జైపూర్ లో ఈ వివాహం జరుగుతున్నది. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, ప్రభాస్, నాని, నాగార్జున వంటి స్టార్స్ జైపూర్ కు చేరుకున్నారు. జైపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే మీడియా చుట్టుముట్టి ఫోటోలు తీసింది.

క్యాజువల్ టీ షర్ట్, జీన్స్, రిస్ట్ వాచ్ తో క్యాజువల్ గా కనిపించిన ఎన్టీఆర్.. చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచ్ హైలైట్ అయ్యింది. ఈ వాచ్ గురించి ఇప్పుడు మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఈ వాచ్ ధర రూ.1.5 నుంచి 2.5 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. రిచర్డ్ మిల్ బ్రాండ్ కు చెందిన ఆర్ఎం 11-3 మెక్ లారెన్ ఆటోమాటిక్ ఫ్లై బ్యాక్ క్రోనోగ్రాఫ్ వాచ్ అది. ఈ వాచ్ సెలెబ్రెటీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందట. ఇప్పుడు ఈ వాచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.