HomeTelugu Trendingహాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్.!

హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్.!

8 20

శృతిహాసన్ కోలీవుడ్, టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. టాప్ హీరోలు పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ లో శృతిహాసన్ ఆడిపాడిన ఈ అమ్మడు నటనను ఎవరు మరిచిపోరు. ఇక ఇదే పవన్ తో కాటమరాయుడులోనూ నటించింది. మహేష్ బాబు తో శ్రీమంతుడులో నటించి మెప్పించింది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజతో పాటు పలువురు స్టార్‌ హీరోల సరసన నటించింది. తాజా సమాచారం ప్రకారం.. శృతి హాసన్ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ “టెడ్స్టోన్”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్‌గా రూపొందనున్న “ట్రెడ్ స్టోన్”ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు. ఢిల్లీలో ఒక హోటలో వెయిట్రెస్‌గా పని చేస్తూ రహస్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భామ తమిళం హిందీలో ఒక్కో సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులో రవితేజతో రొమాన్స్‌ చేయనుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu