HomeTelugu Trendingఆ రోజు ఫుల్‌గా తాగేసా: శృతి హాసన్‌

ఆ రోజు ఫుల్‌గా తాగేసా: శృతి హాసన్‌

5 15
టాలీవుడ్‌లో ఒకప్పుడు శృతిహాసన్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్‌ హీరోలందరితో జత కట్టింది ఈ అమ్మడు. కొంతకాలంగా ఎటువంటి హడావుడి చేయకుండా కామ్‌గా ఉంటుంది. ఆమెపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రవితేజ, గోపీచంద్ మలినేని చిత్రంతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. శృతి అప్పట్లో ఒకసారి ఓ ఇంటర్వ్యూలో నాకు విస్కీ అలవాటు ఉంది” అంటూ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రుతి మరోసారి ఇదే విషయం గురించి మాట్లాడింది.”ఎందుకు మీరు మందు మానేశారు?” అని ప్రశ్నిస్తే..మరోసారి ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది. “నా స్నేహితులతో కలిసి ఒకరోజు రాత్రంతా పార్టీ చేసుకున్నాను. అయితే ప్రతి శనివారం తీసుకునే మోతాదు కంటే చాలా ఎక్కువ తీసుకున్నాను. నా జీవితానికి ఇక ఇది చాలు అనిపించింది. ఇక జన్మలో ముట్టుకో కూడదని నిర్ణయం తీసుకున్నాను. మద్యం మంచిదా కాదా అనేది నేను చెప్పడం లేదు. కానీ అది మానేసిన తర్వాత మాత్రం నా జీవితం చాలా బాగుంది అని భావిస్తున్నాను” అని సమాధానం ఇచ్చింది శృతి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu