
శ్రుతి హాసన్ ఇప్పటివరకు తనలోని పలు కోణాలను ప్రేక్షకులకు చూపించింది. నటిగా, సింగర్‌గా, మ్యుజీషియన్‌గా తన సత్తా చూపిన శ్రుతి హాసన్ తాజాగా తనలోని రచయిత్రిని బయటకు తీస్తోంది. కొంతకాలం కెరీర్‌లో వెనుకబడినా మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది శ్రుతి. క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన శ్రుతి ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు ప్రభాస్ సినిమాలోనూ నటిస్తోంది. మరోవైపు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇంత బిజీలోనూ కొన్ని నెలలుగా ఓ కథను రెడీ చేస్తోందట. ఆ కథను తెరకెక్కించేందుకు స్వయంగా తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనుందట.













