ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ శృతిహాసన్ కొంత కాలం క్రితం సినిమాల నుంచి విరామం తీసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో విడియాక ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది శృతి. వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం రవితేజ మూవీ ‘క్రాక్’లో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లండన్‌లో షూటింగ్ చేస్తున్నారు. శృతి తన పుట్టిన రోజు లండన్ వీధుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రవితేజతో కలిసి నటిస్తున్న ‘క్రాక్’ మూవీ మే8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా శ్రుతిహాసన్ తమిళంలో ‘లాభం’ అనే మరో సినిమాలో నటిస్తోంది.
”ఇది నా పుట్టినరోజు డ్యాన్స్. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాలిని. అందుకే ఇలా డ్యాన్స్ చేస్తూ, సంబరాలు చేసుకుంటున్నా. నాకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా కోసం వెబ్సైట్ ప్రారంభించిన వారికి కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను లండన్‌లో ఉన్నా. నా రాక కోసం నా కుటుంబ సభ్యులు ఎంతో వేచి చూస్తున్నారు. ఈ ఏడాది నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులన్నీ నాకు ఆనందాన్నిచ్చేవే. నేనెప్పుడూ వెళ్లని దారిలో నాకు నచ్చినట్లు వెళ్తున్నా. ఇందుకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అందుకే ఈ డ్యాన్స్ నా హృదయంలో నుంచి వచ్చింది అంటూ ఇన్‌స్టాలో శ్రుతి హాసన్ పోస్ట్ చేసింది.