HomeTelugu Trendingహనుమాన్‌ ఆలయాన్ని ప్రాంభోత్సవ వేడుకలో అర్జున్‌ ఫ్యామిలీ

హనుమాన్‌ ఆలయాన్ని ప్రాంభోత్సవ వేడుకలో అర్జున్‌ ఫ్యామిలీ

Action king Arjun inaugurat

యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా.. ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. ఆయన చెన్నైలో హనుమాన్‌ ఆలయాన్ని ఇటీవల నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో అర్జున్‌ ఈ ఆలయాన్ని నెలకొల్పారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఈ మహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో దాదాపు 35 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu