HomeTelugu Trendingరచయితగా విజయ్‌ దేవరకొండ!

రచయితగా విజయ్‌ దేవరకొండ!

14 8టాలీవుడ్ క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలతో పాటు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు విజయ్‌. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా కోసం రెడీ అవుతున్నాడు.

తాజాగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్‌, రచయితగా కనిపించనున్నాడట. తాను రాసిన కథల్లోని హీరో పాత్రల్లో తానే కనిపించే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేయస్‌ రామారావు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu