మా ఆయన రేప్ చేసాడా.. నోరు ఎలా వచ్చింది.. కంగ‌నపై విరుచుకుపడ్డ ఆదిత్య భార్య

బాలీవుడ్ మీడియాలో ఎప్పుడూ కంగ‌న ర‌నౌత్ పేరు హాట్‌గానే ఉంటుంది. సినిమాలు ఉన్నా లేక‌పోయినా.. హిట్లు వ‌చ్చినా రాక‌పోయినా ఆమె మాత్రం ఎవ‌ర్ గ్రీన్ స్టార్. ఎప్పుడూ సినిమాల‌తో పాటు వివాదాల‌ను కూడా వెంట తిప్పుకుంటూ ఆ స్టార్ డ‌మ్ ఎంజాయ్ చేస్తుంటుంది కంగ‌న‌. ఇక బాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన హీరోయిన్ల‌లో ముందు వ‌ర‌స‌లో ఉంటుంది కంగ‌న‌. త‌న కెరీర్ మొద‌ట్లో చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల ద‌గ్గ‌రికి అవ‌కాశాల కోసం వెళ్లాన‌ని.. త‌న‌ను చాలా మంది వాడుకున్నారంటూ ఓపెన్ ఆన్స‌ర్ ఇచ్చిన సంచ‌ల‌న న‌టి కంగ‌న‌.

ఇలాంటి హీరోయిన్ ఆ మ‌ధ్య‌ బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలీపై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తనను ఆయ‌న మానసికంగానే కాకుండా లైంగికంగానూ వేధించాడ‌ని కామెంట్స్ చేసింది. త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు గానూ ఆదిత్య పంచోలీ కూడా కంగ‌న ర‌నౌత్‌పై ప‌రువున‌ష్టం కేస్ ఫైల్ చేసాడు. ప్ర‌స్తుతం ఈ కేస్ ఇంకా న‌డుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆదిత్య భార్య జ‌రీనా కూడా ఈ విష‌యంలోకి ఎంట్రీ ఇచ్చింది.

త‌న భ‌ర్త గురించి త‌న‌కంటే ఎవ‌రికీ బాగా తెలియ‌ద‌ని.. కంగ‌న ర‌నౌత్ చేస్తున్న కామెంట్స్.. చెబుతున్న మాట‌ల‌న్నీ బూట‌క‌మే అని తేల్చేసింది జ‌రీనా. గ‌తంలో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో త‌న‌కు తెలుస‌ని బాంబు పేల్చింది ఆదిత్య స‌తీమ‌ణి. కంగ‌న ర‌నౌత్ త‌న కెరీర్ కొత్త‌లో పెళ్లైన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్‌ చేసి.. ఆయ‌న‌తో విడిపోయిన త‌ర్వాత రేప్ చేసాడంటూ కొత్త క‌థ‌లు అల్లుతుందంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది ఈమె. అది చాలా పెద్ద త‌ప్ప‌ని.. అస‌లు ఇలా అన‌డానికి కంగ‌న‌కు నోరు ఎలా వ‌చ్చిందో అంటూ విరుచుకుప‌డుతుంది జ‌రీనా పంచోలి. మొత్తానికి కంగ‌న ర‌నౌత్ ఈ ఇష్యూతో మ‌ళ్లీ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.