HomeTelugu Trending'నాని శ్యామ్‌ సింగరాయ్‌' టీజర్‌

‘నాని శ్యామ్‌ సింగరాయ్‌’ టీజర్‌

shyam singha roy teaser

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం ఏఎంబీ మాల్‌లో ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం షేర్‌ చేసింది. నటీనటుల నటన, టీజర్‌ ముందు వచ్చే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్‌‌’’ అంటూ శ్యామ్‌సింగారాయ్‌ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి.

‘టక్‌ జగదీశ్‌’ తర్వాత నాని నటించిన చిత్రమిదే. ఇందులో ఆయన శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్‌గా నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!