HomeTelugu Trending'కట్టప్ప కుమారుడు హీరోగా 'మాయోన్'

‘కట్టప్ప కుమారుడు హీరోగా ‘మాయోన్’

Sibi sathyaraj maayon relea
‘కట్టప్ప’ సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాయోన్’. ఈ సినిమా హక్కులను మూవీమ్యాక్స్ అధినేత, ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ‘మాయోన్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘మాయోన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్‌ వెర్సస్‌ సైన్స్‌ మెయిన్‌ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం.

కిషోర్ ఎన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసింది. అలాగే ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. ఇందులో నటించిన సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ కు మంచి భవిష్యత్‌ ఉంటుంది’ అన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu