HomeTelugu Trendingఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్‌ హీరోలు

Three star heroes in one fr

స్టార్ హీరోలు కమల్‌హాసన్, మోహన్‌లాల్ ‌, మమ్ముట్టి ఒకే ఫ్రేమ్‌ లో  దర్శనమిచ్చారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటమే కాదు.. పాన్ ఇండియా ఇమేజ్‌ విషయంలో ఒకరికొకరు పోటీపడుతుంటారు.

మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ ముగ్గురు హీరోలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ముగ్గురు వైట్ అండ్‌ వైట్ చొక్కా, పంచెకట్టులో సందడి చేయడం విశేషం.
కేరళ ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద వేడుక కేరళీయం 2023 లో స్టార్ హీరోలంతా ఇలా మెరిశారు. వీరితో పాటు శోభన, మంజువారియర్‌ మరియు పలువురు పారిశ్రామిక వేత్తలు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు తిరువనంతపురంలో ఈ వేడుకలు జరగనున్నాయి.

ఈ వేడుక లో కేరళ పురోగతి, విజయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి అందించడం లక్ష్యంగా సెమినార్లు, కార్యకలాపాలు, ప్రదర్శనలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu