HomeTelugu Big Storiesసీత మూవీ రివ్యూ

సీత మూవీ రివ్యూ

01
వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా ‘సీత’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ‘కవచం’ సినిమాలో బెల్లంకొండతో రొమాన్స్ చేసిన కాజల్ ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విడుదలకు ముందే టీజర్ మరియు ట్రైలర్‌లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇవాళ (మే 24) న విడుదలైంది. మరి ఈ సినిమాతో అయినా బెల్లంకొండ హిట్ అందుకున్నాడో లేదో చూసేద్దామా.

కథ:
సీత (కాజల్) ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నడుపుతూ ఉంటుంది. ఒకానొక దశలో తనకు సిటీలోని స్లమ్‌ ఏరియా లో ఇల్లు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం లోకల్ ఎమ్మెల్యే బసవరాజ్ (సోనూసూద్) సహాయం తీసుకుంటుంది. అందుకు గానూ అతడితో నెల రోజులు లివింగ్ టుగెదర్ చేస్తాను అని మాట ఇస్తుంది. బసవరాజ్ పని పూర్తి చేశాక కాజల్ అతడిని మోసం చేస్తుంది. దీనిని సహించని బసవరాజ్ కాజల్ కి సమస్యలని తెచ్చిపెడతాడు. అసలు ఈ కథ కి రామ్ (బెల్లంకొండ) కి ఏంటి సంబంధం? కాజల్ బసవరాజ్ ప్లాన్స్ ని ఎలా అధిగమించింది? చివరికి ఏమైంది? అనేది సినిమా కథ.

1a 3

నటీనటులు:
ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలతో పోలిస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ప్రతి సినిమాలోను ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా తన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్‌ల మీద బాగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాకు కాజల్ అగర్వాల్ నటన పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే కాజల్ ఈసారి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. సోనూసూద్ తన పాత్రకు జీవం పోశారు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమా లో కనిపిస్తున్న సోనూసూద్ విలన్ పాత్రలో బాగానే మెప్పించాడు. మన్నారా చోప్రా మంచి నటనను కనబరిచింది. ఎప్పటిలాగానే తనికెళ్ళ భరణి తన పాత్రకు న్యాయం చేశారు. అభినవ్ గోమాటం ఈ సినిమాలో మంచి పాత్ర పోషించడమే కాక ప్రేక్షకులను మెప్పించాడు కూడా. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

1d
విశ్లేషణ
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ వారు అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బెల్లంకొండ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమాకు నిర్మాతలు కావాల్సినంత బడ్జెట్ సమకూర్చారని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటల సంగతి పక్కన పెడితే అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రాఫర్ శీర్షా రే అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

దర్శకుడు తేజ ఈ సినిమా కోసం ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా మిగతా వాటితో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. దర్శకుడు తేజ తన నేరేషన్‌తో కచ్చితంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు. ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమాను తేజ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. కథ యావరేజ్ గా ఉన్నప్పటికీ ఈ సినిమాలో దర్శకుడు తేజ డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్.. ప్రేక్షకులపై ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఆసక్తికరంగా మొదలైన ఈ సినిమా మొదటి భాగం మొత్తం కామెడీ మరియు క్యారెక్టర్ పరిచయాలతోనే గడుస్తుంది. అంత బలమైన కథ కాకపోయినప్పటికీ దర్శకుడు తేజ నేరేషన్ సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఇక మొదటి హాఫ్ తో పోల్చుకుంటే ఎమోషన్లు సెకండాఫ్‌లో ఎక్కువగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో సెంటిమెంట్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. సినిమా క్లైమాక్స్ బాగుంది. చివరిగా సీతా సినిమా ఒకసారి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనింగ్ సినిమా. అంతేకాక కాజల్ అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా కనువిందుగా ఉంటుంది.

1c 2

టైటిల్ : సీత
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌, సోనూసూద్‌
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
నిర్మాత‌: రామబ్రహ్మం సుంకర
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం: తేజ

హైలైట్స్‌
నేపథ్య సంగీతం
కాజల్‌ నటన

డ్రాబ్యాక్స్
క్లైమాక్స్‌లో కొన్ని సన్నివేశాలు

చివరిగా : కాజల్ అభిమానులకు కనువిందు
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా 'సీత' అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 'కవచం' సినిమాలో బెల్లంకొండతో రొమాన్స్ చేసిన కాజల్ ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విడుదలకు...సీత మూవీ రివ్యూ