HomeTelugu TrendingTollywood: ఆ సెంటిమెంట్‌ మార్చనున్న పాన్‌ ఇండియా మూవీలు!

Tollywood: ఆ సెంటిమెంట్‌ మార్చనున్న పాన్‌ ఇండియా మూవీలు!

 

Tollywood

Tollywood: టాలీవుడ్​లో ఎక్కువగా శుక్రవారం రోజు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. శని, ఆది వారాలు సెలవులు కావడం సినిమాల కలెక్షన్స్‌కు ప్లస్‌ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఎక్కువగా ఈ రోజే ఎక్కువ శాతం విడుదల చేస్తారు. ఇది ఒక సెంటిమెంట్‌లా మారిపోయింది.

అయితే ఇప్పుడు టాలీవుడ్​లో ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. వీకెండ్స్​లో లాంగ్ రన్​ కోసం ఒక రోజు ముందే అంటే గురువారమే మూవీస్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ​అలా ఈ ఏడాది రానున్న ఆయా బడా హీరోల సినిమాలు అన్నీ గురువారమే రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలో గురువారమే రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం..

ఇండియన్ 2: కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారతీయుడు-2. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత మూడేళ్లుగా సెట్స్‌ పైన ఈ సినిమా ఇప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఈ మూవీ జూన్ 13 (గురువారం)న రిలీజ్ కానుంది. ఆ వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం బక్రీద్ సెలవు కలిసివచ్చేలా ఆ మూవీ యూనిట్ రిలీజ్​ను ఇలా ప్లాన్ చేశారు.

కల్కి 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఈ సినిమా మొదట మే 9న విడుదల కావాల్సింది. అయితే ఎన్నికల హడావుడి ఉండడం వల్ల ఈ మూవీ రిలీజ్ జూన్ 27కు వాయిదా వేశారు. అయితే ఈ సినిమా విడుదలవతున్న వారం లాంగ్ వీకెండ్ కాదు. కానీ, గురువారం రీలీజ్ చేయడం వలన వీకెండ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినిమా యూనిట్ భావిస్తుంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో స్టార్‌ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప ది రూల్: ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న తెలుస్తుంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే సెలవు ఆ తర్వాత వచ్చే వీకెండ్ ఈ మూవీకి ఉపయోగపడే అవకాశం ఉంది.

సరిపోదా శనివారం: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీ కూడా ఆగస్ట్ 29న అంటే గురువారమే విడుదలవుతుంది. అయితే ఈ సినిమా రీలీజ్ అవుతున్న వారం ఎలాంటి లాంగ్ వీకెండ్ లేదు.

దేవర: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీని మొదటిగా వేసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల దసరాకు వాయిదా వేశారు. ఈ సినిమా కూడా అక్టోబర్ 10 అంటే గురువారం విడుదల కానుంది. దసరా సెలవులు ఈ మూవీ కలెక్షన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu