HomeTelugu Trendingస్పెషల్‌ వీడియోతో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన 'సితార '

స్పెషల్‌ వీడియోతో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ‘సితార ‘

sitara ugadi wishes with sp
ఉగాది సందర్భంగా సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు గారాల పట్టి సితార ఉగాది విషెస్‌ తెలియజేసింది. ప్రతి పండగకి అభిమానులకు శుభాకాంక్షలు చెప్పడం సితారకు అలావాటు. ఆ పండగ ప్రత్యేకత తెలుసుకొని మరి దానికి తగ్గట్టుగా రెడీ అయి విషెస్‌ తెలియజేస్తుంది.

ఉగాది పండక్కి కూడా సితార అదే ఫాలో అయింది. ఉగాది సందర్భంగా ట్రెడిషనల్‌ లుక్‌లో ఓ బ్యూటిఫుల్‌ ఫోటోషూట్‌ చేయించుకుంది సితార. దానికి సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘అందరికి ఉగాది శుభాకాంక్షలు’ అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియో సితార డ్రెడిషనల్‌ లుక్‌లో సితార చాలా ముద్దుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో కొడుతోంది. కాగా సితార ‘సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అదే సినిమాలో ‘పెన్ని’ సాంగ్‌కు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది.

https://www.instagram.com/reel/Cb1ebkJlzP8/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu