HomeTelugu Trending'సీతారామం' సెన్సార్‌ పూర్తి

‘సీతారామం’ సెన్సార్‌ పూర్తి

Sitaramam censor complete
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈసినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఆగస్టు 5వ తారీఖున భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈసినిమా కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా కు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ కానీ రొమాంటిక్ ఎలిమెంట్స్ లేని కారణంగానే సినిమా కు క్లీన్ యూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ బోర్డు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో పలువురు స్టార్‌ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Censor Report of Sitaramam..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu