HomeTelugu Trending'స్కైలాబ్' టీజర్‌

‘స్కైలాబ్’ టీజర్‌

Skylab Release Teaser
సత్యదేవ్, నిత్యామీనన్ ప్రథాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

చాలా కాలం క్రితం స్కైలాబ్ పడుతుందనీ .. ఎవరూ బ్రతకరనే ప్రచారం గ్రామాల్లో బలంగా జరిగింది. దాంతో ఎవరికి ఇష్టమైనవి వారు చేసుకుని తిన్నారు. ఏ క్షణంలో ఎక్కడ స్కైలాబ్ పడుతుందోనని ఆకాశం వైపు చూస్తూ భయంతో బ్రతికారు. ఆ సంఘటననే ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది.

టీవీలకు .. మొబైల్ ఫోన్లకు దూరంగా గడిచిన ఆ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని బాగానే ప్రతిబింబించారు. సినిమాలో కావలసినంత కామెడీ ఉంటుందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. తులసి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu