HomeTelugu Trending'విజయ్‌ 68'లో స్నేహ!

‘విజయ్‌ 68’లో స్నేహ!

Sneha in Vijay 68

తమిళ ప్రముఖ నటుడు విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘దళపతి 68’. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో విజయ్‌ డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నాడు. అలనాటి అందాల హీరోయిన్ జ్యోతిక , ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతుంది.

ఈ సినిమాలో సీనియర్ నటి స్నేహ కీలక పాత్రలో మెరువబోతుందని టాక్‌. వెంకట్ ప్రభు టీంతో దిగిన సెల్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో హల్‌ చల్ చేయడంతో.. స్నేహ దళపతి 68లో భాగమవుతుందని న్యూస్‌ తెరపైకి వచ్చింది. అయితే స్నేహ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో భాగంగా మాత్రమే ఇలా వెంకట్‌ ప్రభుతో కలిసి సందడి చేసిందట. అంతేకానీ దళపతి 68లో నటిస్తుందనే వార్తలపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం విజయ్‌ లియో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లియో అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu