HomeTelugu Trending'ఎక్స్‌పైరీ డేట్‌'తో స్నేహా ఉల్లాల్

‘ఎక్స్‌పైరీ డేట్‌’తో స్నేహా ఉల్లాల్

Sneha Ullal in Expiry Date
కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన నటీనటులందరూ ఇప్పుడు వెబ్‌సిరీస్‌లవైపు చూస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లు సైతం వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా బాలయ్య సరసన సింహా సినిమాలో రొమాన్స్ చేసిన స్నేహా ఉల్లాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించబోతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసింది. అంతకంటే ముందు బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ సరసన నోటైమ్ ఫర్ లవ్ సినిమాలో చేసింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్‌ పోస్టు చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. త్వరలో ‘ఎక్స్‌పైరీ డేట్’ వెబ్‌ సిరీస్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శంకర్ మార్తాండ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu