HomeTelugu Trendingచిరంజీవికి జంటగా.. సోనాక్షి సిన్హా!

చిరంజీవికి జంటగా.. సోనాక్షి సిన్హా!

Sonakshi sinha opposite Chi

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మెరవనుందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ బాబీ తో ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా సోనాక్షి అయితే బాగుంటుందనే అభిప్రాయంతో.. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. దాదాపు ఆమెనే ఖరారు కావొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. వచ్చేనెలతో ఈ సినిమా షూటింగు పూర్తి కానుంది. ఆ తరువాత ప్రాజెక్టుగా మలయాళ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ పట్టాలెక్కుతుంది. అది పూర్తయ్యాక బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu