గోవాకు బై చెప్పిన ‘డిస్కో రాజా’

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డిస్కో రాజా’. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభానటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గోవా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు.

ఎస్‌ఆర్‌టీ మూవీ బ్యానర్‌పై రామ్‌ తళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తమన్‌ సం‍గీతమందిస్తున్నాడు. వెన్నెల కిశోర్‌, తాన్యా హోపేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొంత కాలంగా సరైన హిట్స్‌ లేక ఇబ్బందుల్లో ఉన్న రవితేజ, డిస్కోరాజా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్‌ మహరాజ్‌ రెండు డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా డిసెంబర్‌ 20న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.