HomeTelugu Trendingవేశ్యగా నటించనున్న సోనాక్షి!

వేశ్యగా నటించనున్న సోనాక్షి!

Sonakshi sinha play a role

ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ తొలి వెబ్‌సిరీస్‌లో సోనాక్షి నటించడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవలే ‘గంగూబాయి కతియా వాడి’ చిత్రీకరణను పూర్తి చేశారు. అలియాభట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఇప్పుడు ఆయన దృష్టంతా భారీస్థాయిలో తెరకెక్కనున్న ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌పైనే ఉంది. ఆయన నుంచి రానున్న తొలి వెబ్‌సిరీస్‌ ఇది. ఇందులో ఇప్పటికే హ్యూమా ఖురేషి ఎంపికైంది.

ఇప్పుడు మరో ప్రధాన పాత్ర కోసం సోనాక్షి సిన్హాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో సోనాక్షి వేశ్యగా నటించనుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం కథక్‌ నేర్చుకునే పనిలో ఉందట సోనాక్షి. ‘‘హీరామండి’లో పాటలు చాలా కీలకం కావడంతో వాటిని అద్భుతంగా తెరపైకి తీసుకురావాలని భన్సాలీ భావిస్తున్నారు’’ అని భన్సాలీ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. సోనాక్షి గతంలో భన్సాలీ నిర్మించిన ‘రౌడీ రాథోడ్‌’లో నటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu