HomeTelugu Trendingరాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనుసూద్‌

రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సోనుసూద్‌

sonu sood clarity on his po

బాలీవుడ్‌ నటుడు సోనుసూద్ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వేలాది మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచాడు. తద్వారా మన దేశంలో రియల్ హీరోగా నిలిచాడు. సోను ప్రారంభించిన సేవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోను తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను పలు సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్పారు.

ఇదిలావుంచితే, సోను సోదరి మాళవిక రాజకీయల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్ లోని మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పోటీ చేస్తున్నారు. దీనిపై సోను మాట్లాడుతూ.. మోగా నియోజకవర్గంతో తమకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని చెప్పారు. తన తల్లి ఆ ప్రాంతంలో ఎందరికో విద్యను అందించారని, విద్యకు సంబంధించిన వసతులను నెలకొల్పారని తెలిపారు. మరోవైపు తన సోదరి తరపున సోను ప్రచారం నిర్వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu