HomeTelugu Trendingఆచార్య నుండి సోనూసూద్‌ ఫస్ట్‌లుక్‌

ఆచార్య నుండి సోనూసూద్‌ ఫస్ట్‌లుక్‌

sonu sood first look from a

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ నిన్న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. సినీ ప్రముఖులు సహా సామాన్యులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేసారు. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ బర్త్‌డే సందర్భంగా ఆచార్య టీం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ చిరంజీవిగా ‘ఆచార్య’ సినిమాలో సోనూసూద్‌ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.

సోనూసూద్‌ బర్త్‌డే సందర్భంగా ఆచార్యలో ఆయన లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. నుదుట బొట్టు పెట్టుకుని పిల‌క‌తో సోనూసూద్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. తెలుగు నాట ఎక్కువగా విలన్‌ పాత్రలతో పాపులర్‌ అయిన సోనూసూద్‌ ఆచార్య లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu