HomeTelugu Trendingతాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్‌ చేయండి: సోనూసూద్‌

తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్‌ చేయండి: సోనూసూద్‌

Sonu sood helps boy sells v

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రైతులు, కార్మికులు, రోగులు.. ఆయన్ని సాయం కోరినవారికి తనకు తోచిన సాయం చేస్తూవసున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పలువురు తమ సమస్యలను సోనూసూద్‌ దృష్టికి సోషల్‌ మీడియా ద్వారా తీసుకెళ్తుతున్నారు. ఆయన చేస్తున్న సేవలకు కొంతమంది అభిమానులు ఆయన ఇంటివద్దకు వెళ్లిమరీ కృతజ్ఞతలు తెలిపినవారు ఉన్నారు.

తాజాగా సోనూసూద్‌ తన ఇంటి ముందుకు వచ్చిన కూరగాయలు అమ్మె ఇద్దరు వ్యక్తులు మాట్లాడాడు. వారి బండిలో ఉన్న కూరగాయల ధరల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా కనుకున్నారు. బండి మీద కూరగాయాలు అమ్మెవారి వద్ద తాజా కూరగాయలు ఉంటాయని తెలిపారు. బండిమీద కూరగాయలు ఆమ్మెవారి వద్ద కొంటే చిన్న వ్యాపారులకు సాయం అందిచినట్లు అవుతుందని అన్నారు. కూరగాలయబండి వారితో మాట్లాడిన ఓ వీడియోను సోనూసూద్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్‌ చేయండి’ అని కామెంట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu