HomeTelugu Trendingఆచార్య సెట్స్ లో అడుగుపెట్టిన 'సోనూసూద్'

ఆచార్య సెట్స్ లో అడుగుపెట్టిన ‘సోనూసూద్’

Sonu Sood joins in Acharya
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. చిరంజీవి కరోనా పాజిటివ్ అని రావడం.. ఆ తర్వాత నెగటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. అయితే కొరటాల చిత్రీకరణ ఆపేయకుండా చిరు లేని సన్నివేశాలను తీస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ‘ఆచార్య’ సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ఇందులో సోనూ నెగెటివ్ రోల్ లో కనిపిస్తాడా లేదా పాజిటివ్ పాత్రలో నటిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. కాగా ‘ఆచార్య’ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 2021 వేసవిలో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇటీవలే సోనూ బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో పాల్గొన్నాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu