HomeTelugu Trendingఅనిల్‌ రావిపూడి ఇంట్లో సంబరాలు.. ప్రముఖుల శుభాకాంక్షలు

అనిల్‌ రావిపూడి ఇంట్లో సంబరాలు.. ప్రముఖుల శుభాకాంక్షలు

1 4
దర్శకుడు అనిల్ రావిపూడి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా మహేష్ కూడా ట్విట్టర్ వేదికగా విషేస్ తెలిపారు. అనిల్ రావిపూడి సతీమణి ఈరోజు ఉదయం ప్రసవించగా అబ్బాయి పుట్టాడు. అది అలా ఉంటే మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సంక్రాంతి ముందే దర్శకుడు అనిల్ ఇంట్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు విడుదలకు ముందే ఇలా కొడుకు రూపంలో వచ్చిన అతి పెద్ద గిఫ్ట్‌కి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారట. మరోవైపు ఈ సినిమా విడుదల విషయంలో గత వారం రోజులుగా ఏర్పడిన సందిగ్దతకు తెరదించుతూ నిన్న విడుదల తేదీ ప్రకటించారు దిల్ రాజు. ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu