HomeTelugu Trendingరజనీ కుమార్తె రెండో పెళ్ళికి ముహుర్తం ఫిక్స్‌..!

రజనీ కుమార్తె రెండో పెళ్ళికి ముహుర్తం ఫిక్స్‌..!

6 21సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారట. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య పెళ్లాడబోతున్నారట. గతేడాది సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 11న పెళ్లి జరగనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వీరి వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించనున్నట్లు తెలుస్తోంది. మెహెందీ, సంగీత్‌ కార్యక్రమాలతో కలిపి మూడు రోజుల పాటు వివాహ వేడుక ఉండబోతోందట.

వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే తలైవా నివాసంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ‘వంజగర్‌ ఉళగమ్‌’ అనే చిత్రంలో విషగన్‌ నటించారు. 2010లో సౌందర్య.. అశ్విన్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల 2017లో సౌందర్య, అశ్విన్‌ విడాకులు తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu