HomeTelugu Trendingబాలీవుడ్‌కి సీతాగా సాయిపల్లవి!

బాలీవుడ్‌కి సీతాగా సాయిపల్లవి!

Sai Pallavi Bollywood entryఫిదా బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ.. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు ఆమె చేరువైంది. ఆమెకు తమిళ, మలయాళ భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. దక్షిణాదిలో మెప్పించిన ఆమె బ్యూటీ బాలీవుడ్‌ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. అది కూడా ఓ పౌరాణిక చిత్రంతో కావడం విశేషం.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కనిపించనున్నారు. రావణుడి పాత్రను హృతిక్ రోషన్ పోషించనున్నారు. తెలుగు వారైన మధు మంతెన నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో సీత పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ పాత్రకు గతంలో దీపిక పదుకొణె, కరీనా కపూర్‌‌ పేర్లు వినిపించాయి. ఇప్పుడు సాయిపల్లవిని ఫిక్స్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటిన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu