HomeTelugu Trendingఆకట్టుకుంటున్న 'విక్రమ్ గౌడ్' కొత్త పోస్టర్‌

ఆకట్టుకుంటున్న ‘విక్రమ్ గౌడ్’ కొత్త పోస్టర్‌

Special poster from vikram

కన్నడ యంగ్‌ హీరో కిరణ్‌ రాజ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘బడ్డీస్‌’ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. కుమారి సాయి ప్రియ సమర్పణలో.. మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నాడు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కిరణ్ రాజ్ పుట్టిన రోజు(జూలై 5) సందర్భంగా ‘విక్రమ్ గౌడ్’ నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కిరణ్ రాజ్ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు విపరీతమైన స్పందన లభించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu