HomeTelugu Trendingచిరంజీవి 'ఆచార్య' కోసం భారీ ఆలయం సెట్

చిరంజీవి ‘ఆచార్య’ కోసం భారీ ఆలయం సెట్

special set for acharya m

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సామాజిక కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ పూర్తవ్వగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి దేవదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఓ పురాతన ఆలయం సెట్‌ను వేయిస్తున్నారట మేకర్స్‌. ముందుగా ఏదైనా గుడిలో షూటింగ్ చేద్దామనుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితిలో అది కుదిరేలా లేదు దాంతో ఆలయం సెట్ వెయ్యాలని నిర్ణయించారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu