HomeTelugu Trendingబాలకృష్ణ కోసం ఆలయం!

బాలకృష్ణ కోసం ఆలయం!

Latest news of balayya boy

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘BB3’. ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు.. రూ .30 లక్షల బడ్జెట్ తో స్టూడియోలో ఆలయ సెట్ ను నిర్మించారని తెలుస్తోంది. ఇందులో షూటింగ్ 4 రోజుల క్రితం ప్రారంభమైంది. ఇది మార్చి 22 వరకు కొనసాగుతుంది. కొద్దిరోజుల విరామం తరువాత బిబి 3 యూనిట్ తదుపరి భారీ షెడ్యూల్ కోసం కర్ణాటకలోని బెల్గామ్ కు బయల్దేరి వెళుతుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రల్లో కనిపించనున్నారు. ఆలయ నేపథ్యంలో యూనిట్ సుదీర్ఘమైన కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ఎమోషనల్, యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన బోయపాటి ఈ ఆలయ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu