‘దసరా’ బరిలో బాలయ్య!


నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 108 (NBK 108)తో రెడీ అంటున్నాడు. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ పక్క తెలంగాణ యాసలో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా అనిల్‌ రావిపూడి టీం నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ అందించింది.

నటసింహం విజయదశమికి ఆయుధపూజ చేసేందుకు రెడీ అవుతున్నాడు.. అంటూ ‘ఎన్‌బీకే 108’ దసరాకు విడుదలవుతుందని చెప్పాడు. దీంతో పాటు విడుదల చేసిన లుక్ సొషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఈ సారి కూడా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా..యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి- బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది.

Image

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates