HomeTelugu Trending'పుష్ప 2' ఆఫర్‌ని వదులుకున్న శ్రీలీల!

‘పుష్ప 2’ ఆఫర్‌ని వదులుకున్న శ్రీలీల!

Sreeleela gave up the offer
టాలీవుడ్‌ మోస్ట్‌ వాటెండ్‌ హీరోయిన్‌ శ్రీలీల. ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన ఈ అమ్మడే కనిపిస్తుంది. ఆమె చేతిలో దాదాపు 10 సినిమాల వరకూ ఉన్నాయి. చర్చల దశలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మూడేళ్ల పాటు వరుసగా ఆమె సినిమాలు థియేటర్లకు రానున్నాయి.

అలాంటి శ్రీలీలకి ‘పుష్ప 2’ సినిమా నుంచి ఆఫర్ వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ను శ్రీలీలతో చేయిస్తే ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారట. అయితే ఇప్పట్లో ఈ తరహా సాంగ్స్ చేసే ఆలోచన లేదని ఆమె తేల్చిచెప్పినట్టుగా సమాచారం.

శ్రీలీల కెరియర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. రామ్, నితిన్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ , నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో ఆమె చేస్తోంది. హీరోయిన్ గా ఆమె ఇంకా నిలదొక్కుకునే స్టేజ్ లోనే ఉంది గనుక, ఐటమ్ సాంగ్ కి నో చెప్పి ఉంటుంది. ఇక తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె మరోసారి రవితేజ జోడీ కట్టనున్నట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu