HomeTelugu Trendingశర్వానంద్‌కు ఆపరేషన్ పూర్తి.. 2 నెలలు షూటింగ్‌కు దూరం

శర్వానంద్‌కు ఆపరేషన్ పూర్తి.. 2 నెలలు షూటింగ్‌కు దూరం

 

8 15

షూటింగ్‌లో గాయపడ్డ యువ కథానాయకుడు శర్వానంద్‌కు శస్త్ర చికిత్స పూర్తయింది. 11 గంటలపాటు శ్రమించి వైద్యులు ఆయన భుజానికి చికిత్స చేశారు. రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శర్వానంద్‌ మరో రెండు నెలల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండబోతున్నారు. 96 సినిమా షూటింగ్‌ సమయంలో శర్వానంద్‌ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్కై డైవింగ్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలున్నాయి. దాని కోసం థాయ్‌లాండ్‌లో తర్ఫీదు పొందుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ శర్వా గాయడ్డారు. సరైన దిశలో ల్యాండ్‌ అవ్వని కారణంగా శర్వా భుజానికి, కాలికి గాయమైంది. వెంటనే ఆయన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. సోమవారం శస్త్ర చికిత్స చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu