HomeTelugu Trendingరవితేజ 'ధ‌మాకా'లో శ్రీలీలా

రవితేజ ‘ధ‌మాకా’లో శ్రీలీలా

Sreeleela poster from dhama

టాలీవుడ్‌లో ‘పెళ్ళి సంద‌D’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాతోనే యూత్‌లో విప‌రీతమైన క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది. ఈ సినిమా విజ‌యంలో ఈమె కీల‌క‌పాత్ర వ‌హించిందని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమా త‌ర్వాత‌ శ్రీలీల‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. యువ హీరోల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. కాగా మంగ‌ళ‌వారం శ్రీలీలా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

శ్రీలీలా చేతిలో ప్ర‌స్తుతం మూడు, నాలుగు సినిమాల‌న్నాయి. అందులో ‘ధ‌మాకా’ ఒక‌టి. మాస్‌రాజ ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకి త్రినాధ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా మేకర్స్ శ్రీలీలా పోస్టర్‌ను విడుద‌ల చేస్తూ బ‌ర్త్‌డే విషెస్‌ను వెల్ల‌డించారు. ఈ పోస్ట‌ర్‌లో శ్రీలీల లుక్‌ ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై అభిషేక్ అగర్వాల్‌, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు శ్రీలీలా నితిన్-వ‌క్కంతం వంశీ సినిమాలో న‌టిస్తుంది. బాల‌కృష్ణ‌-అనీల్ రావిపూడి చిత్రంలో బాల‌కృష్ణ కూతురు పాత్ర‌లో న‌టిస్తుంది. వీటితో పాటుగా మంత్రి గాలిజ‌నార్థ‌న్ రెడ్డి కుమారుడు కిరీటీ డెబ్యూ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu