విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్న అమలాపాల్‌..!

కోలీవుడ్‌లో ఎస్పీ జననాథన్‌ శిష్యుడు వెంకట్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి 33వ చిత్రం తెరకెక్కబోతుంది. చిత్రా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతికి జోడీగా అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో తడం ఫేమ్‌ మగిళ్‌ తిరుమేని ప్రతినాయకుడు. ఈ సినిమా నుంచి అమలాపాల్
తప్పుకుందని, ఆమె స్థానంలో మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఊటీలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాకుండా అమలాపాల్‌ తప్పుకోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముందుగా అడిగిన రెమ్యూనరేషన్‌ కన్నా ఇప్పుడు ఎక్కువగా అడుగుతోందని.. అంతేకాకుండా పలు షరతులు కూడా ఆమె పెడుతున్నట్లు సమాచారం. అందుకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో అమలాపాల్ తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాల్షీట్‌ సమస్య వల్ల కూడా ఆమె నటించలేదని అంటున్నారు.