HomeTelugu NewsSreeleela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన క్రేజీ బ్యూటీ

Sreeleela: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన క్రేజీ బ్యూటీ

Sreeleela

Sreeleela: టాలీవుడ్‌లో ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఆ తరువాత ధమాకా హిట్‌తో వరుస సినిమాలు చేసి టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చేతి నిండా సినిమాలతో చాలా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ అమ్మడు. తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోలతో నటించింది.

ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్​ మాత్రమే ఉంది. ఇది కూడా తాత్కాలికంగా షూటింగ్ జరుపుకోవట్లేదు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక షూటింగ్ మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు దాదాపు ఐదారు విడుదలైయ్యాయి. అయితే శ్రీలీలకు అనిల్‌ రావిపూడి- బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరిలో తప్ప మరే సినిమాలోనూ తగినంత గుర్తింపు రాలేదు.

చివరిగా మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో శ్రీలీల స్పీడ్‌కి బ్రేక్‌లు పడ్డాయి. కాగా వరుస ఫ్లాప్స్‌ అనంతరం శ్రీలీల కెరీర్‌ పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా శ్రీలీల ఓ లక్కీ ఛాన్స్‌ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ హీరోగా మార్క్‌ ఆంటోనీ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని రూపొందిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్తున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీలో హీరోయిన్‌ ఛాన్స్‌ శ్రీలీలకు వచ్చిందని తెలుస్తోంది.

ఇప్పటికే మూవీ టీమ్‌ శ్రీలీలను కాంటాక్ట్‌ కూడా అయిందని, స్టోరీ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కెరీర్‌లో బిగ్‌ హిట్‌ కోసం ఎదురు చూస్తున్న శ్రీలీలకు బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. దీని తర్వాత ఆమెకు కోలీవుడ్‌లో వరుస అవకాశలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ ప్రాజెక్ట్‌ నిజంగా ఓకే అయితే శ్రీలీల కెరీర్‌ గ్రాఫ్‌ మారిపోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ హీరో అజిత్‌ జోడీగా నటిస్తే శ్రీలీల కెరీర్‌కి బిగ్ ప్లస్‌ అవుతుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu