HomeTelugu Newsహైదరాబాద్‌లో కుంభవృష్టి

హైదరాబాద్‌లో కుంభవృష్టి

13 15హైదరాబాద్‌లో కుంభవృష్టి వాహనదారులకు నరకం చూపిస్తోంది.. రాత్రి 10.30 గంటలకు దాటినా వాహనదారులు రోడ్లపై ఇరుక్కుపోయారు. ఓవైపు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయ. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరుచుకుందో తెలియని పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం రాత్రి 10 గంటల వరకు తిరుమలగిరిలో అత్యధికంగా 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 5.2, ఖైరతాబాద్‌లో 3.9, బాలాజీనగర్‌లో 5.5, కీసరలో 5.9, మల్కాజ్‌గిరిలో 5.3, ముషీరాబాద్‌లో 4.5, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌లో 5.1, మారేడుపల్లిలో 4.5, ఉప్పల్‌లో 4.0, హిమాయత్‌నగర్‌లో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆ తర్వాత కూడా కుంభవృష్టి కురుస్తుండడంతో ఈ లెక్కలు మారిపోనున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురువగా.. సాయంత్రం వర్షం జోరందుకుంది. ఇక రాత్రి సమయంలో కుంభవృష్టిగా మారిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu