HomeTelugu Trendingఎన్టీఆర్‌తో 'పెళ్లి సందD'హీరోయిన్‌!

ఎన్టీఆర్‌తో ‘పెళ్లి సందD’హీరోయిన్‌!

Sreeleela with NTR

టాలీవుడ్‌లో ‘పెళ్లి సందD’సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ సినిమా టాక్ సంగతి అటుంచితే, శ్రీలీల కు మాత్రం ఈ సినిమా బాగా కలిసివచ్చింది. కృతి శెట్టి తరువాత గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మనే.

ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ సరసన హీరోయిన్‌గా ‘ధమాకా’ సినిమా చేస్తోంది. నక్కిన త్రినాథరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ జోనర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. అంతేకాక ఈ బ్యూటీకి మెగా ఛాన్స్‌ కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా ఈ కన్నడ బ్యూటీ ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్నట్లు టాక్‌. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా అలియా భట్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu