HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌-4 'నగ్నం' బ్యూటీ.!

బిగ్‌బాస్‌-4 ‘నగ్నం’ బ్యూటీ.!

8 7తెలుగు ‘బిగ్‌బాస్ సీజ‌న్-4’ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. గ‌త కొన్ని రోజులుగా ఈ సిరీస్‌పై రోజుకో కొత్త వార్త వినిపిస్తుంది. ఇప్ప‌టికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌ల‌ను ఎంపిక చేస్తున్నారంటూ జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రో హాట్‌ బ్యూటీ పేరు వెలుగులోకి వ‌చ్చింది. ఆర్జీవీ ‘న‌గ్నం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అలియాస్ ‘శ్రీ రాపాక’ బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొనబోతున్నట్టు వా‌ర్త చక్కర్లు కొడుతోంది.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ రూపొందించిన ‘నగ్నం’ సినిమాలో బోల్డ్‌గా న‌టించి వార్త‌ల్లో నిలిచింది స్వీటీ‌. కాగా ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు వరుసగా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. అంతేకాక ప‌లువురి సెలబ్రెటీలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.  ‘న‌గ్నం’ సినిమా ప్ర‌మోష‌న్‌తో పాటు బిగ్‌బాస్ సీజ‌న్-4లో కూడా అవ‌కాశం కోస‌మే స్వీటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే ఈ సీజ‌న్‌లో హీరో త‌రుణ్‌, మంగ్లీ, బిత్తిరి స‌త్తి, హాట్ హీరోయిన్స్ హంసా నందిని, శ్ర‌ద్దా దాస్‌, యామినీ భాస్క‌ర్‌, ప్రియా వ‌డ్ల‌మాని ఎంపిక అయ్యారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సీజ‌న్‌ మొత్తాన్ని గ్లామర్‌తో నింపేయాలని అనుకుంటున్న నిర్వాహ‌కులు హాట్ హీరోయిన్‌లనే సెలెక్ట్ చేస్తున్నార‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే శ్రీ రాపాకను బిగ్‌బాస్ సీజ‌న్ కోసం నిర్వాహ‌కులు ఎంపిక చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచిచూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu