HomeTelugu Trendingబన్నీపై శ్రీరెడ్డి కామెంట్స్‌..

బన్నీపై శ్రీరెడ్డి కామెంట్స్‌..

7 6
సంచలన నటి శ్రీ రెడ్డికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్లకు మాత్రం ఎందుకో ఆమె ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడూ శ్రీ రెడ్డిపై ఫైర్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది ఈమె. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే తాజాగా జరిగిన అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్‌లో బన్నీ కనిపించిన తీరుపై మండిపడింది శ్రీ రెడ్డి.

ఎప్పుడూ మనుషులను టార్గెట్ చేసే ఈమె ఇప్పుడు మాత్రం వెరైటీగా అల్లు అర్జున్ హెయిర్ స్టైల్‌ను లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేసింది. అల్లు అర్జున్‌ ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్‌తో సినిమాల్లో వస్తావా.. ఎప్పుడూ ఎక్స్‌టెన్షన్ విగ్గులేనా.. అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఈమె ఫేస్‌బుక్ పోస్ట్ చూసి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అక్కడితో ఆగకుండా అల్లు అర్జున్ ఆర్మీ శ్రీ రెడ్డిని ఆడుకుంటున్నారు. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఇలా చేస్తూనే ఉంటావా అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్.

బన్నీని ఈమె టార్గెట్ చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ చేసింది. అప్పట్లో బన్నీ ఓ కార్ కొన్నాడు. దీన్ని తన ఇంటి మెంబర్ అని పరిచయం చేసాడు అల్లు అర్జున్. దీనికి బీస్ట్ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ. అయితే ఈయన కార్ కొనడం శ్రీ రెడ్డికి నచ్చలేదు. అస్సలు నచ్చలేదు.. ఎంతలా అంటే మళ్లీ సోషల్ మీడియాలో నానా రచ్చ చేసేంతగా. ఈయన కార్ కొనడంతో కారు కూతలు కూసింది శ్రీ రెడ్డి. కార్ కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తూ.. మరోవైపు సెటైర్లు కూడా వేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా బన్నీ బీస్ట్‌పై శ్రీ రెడ్డి కళ్లు పడ్డాయి. కోట్లు పెట్టి కొన్నావ్ కదా.. మరి నిన్ను అభిమానించిన కేరళ వాళ్లకు వరదలు వస్తే ఏం చేసావంటూ బన్నీని నిలదీసింది ఈ ముద్దుగుమ్మ.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu